బాలీవుడ్‌ కండల వీరులు హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ కలసి ఓ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ చిత్రం

0
75

బాలీవుడ్‌ కండల వీరులు హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ కలసి ఓ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది? అందులోనూ వారిద్దరి మధ్య అదిరిపోయే ఫైటింగ్‌ సీన్లు ఉంటే ఇంకెంత మజాగా ఉంటుంది? ఆ అనుభూతిని ప్రేక్షకులకు చూపించ బోతోంది ‘వార్‌’. హృతిక్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్‌ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు తాజాగా ‘వార్‌’ అనే టైటిల్‌ ఖరారు చేయడంతో పాటు టీజర్‌ను విడుదల చేశారు. అందులో హృతిక్‌, టైగర్‌ మధ్య ఉత్కంఠ రేకెత్తించే పోరాట సన్నివేశాలు, బైక్‌, కార్‌ ఛేజింగ్‌లు, హెలికాప్టర్‌తో సాహసాలు, కనువిందు చేసే విదేశీ లొకేషన్లు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. కథానాయిక వాణీ కపూర్‌ అందాలు ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ విడుదల సందర్భంగా టైగర్‌, హృతిక్‌ మధ్య ట్విటర్‌లో సరదా సంభాషణ జరిగింది. ‘‘హృతిక్‌.. నీ ఫైట్లలో వాడి తగ్గినట్లుంది. అవి ఎలా చేయాలో నేను నీకు చూపిస్తా’’ అని టైగర్‌ ట్వీట్‌ చేయగా.. ‘టైగర్‌.. నేను ఏలిన ప్రపంచంలోకి నువ్వు ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నావ్‌. బుద్ధిగా కూర్చో’’ అని హృతిక్‌ బదులిచ్చాడు. అక్టోబరు 2న ఈ చిత్రం విడుదల కానుంది.