ప్రతిపక్షంపై ఆరోపణలకే సభా సమయాన్నంతా వైకాపా దుర్వినియోగం

0
61

అమరావతి: ప్రతిపక్షంపై ఆరోపణలకే సభా సమయాన్నంతా వైకాపా దుర్వినియోగం చేస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు.  ప్రజా సమస్యలను పరిష్కరించలేక తెదేపాను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా వ్యూహ కమిటి సభ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెదేపా హయాంలోనే  పోలవరం పనులు 66 శాతం పూర్తయ్యాయన్నారు. కేంద్రం నుంచి పెండింగ్ నిధులు తెచ్చుకోవడం చేతకాకే వైకాపా ఆరోపణలు చేస్తోందని మండి పడ్డారు.

అర్థంలేని అవినీతి ఆరోపణలతో విలువైన శాసనసభ కాలాన్ని వృథా చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. విచారణల పేరుతో కాలం గడిపేయాలని జగన్‌మోహన్‌ రెడ్డి చూస్తున్నారన్నారు. అవినీతి ఆరోపణల ద్వారా పోలవరం పనులను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయని, పీపీఏలపై బురద జల్లాలనే ప్రయత్నం చేసి ప్రభుత్వం అభాసుపాలైందని ఆరోపించారు. ‘‘ సున్నావడ్డీ రుణాలు తెదేపా ఇవ్వలేదని జగన్‌ మోహన్‌రెడ్డి రెడ్డి చెప్పారు. ఆధారాలతో సహా బయట పెట్టేసరికి ప్లేటు ఫిరాయించారు.కియా వైఎస్‌ తెచ్చారని బుగ్గన చెప్పడం హాస్యాస్పందంగా ఉంది.’’ అని చంద్రబాబు అన్నారు.