హైదరాబాద్: యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ సినిమాకు ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టేశారు. సోమవారంతో సినిమాకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ చిత్రబృందంతో కలిసి సెల్ఫీ దిగారు. అంతేకాదు పార్టీ కూడా చేసుకున్నారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా పలువురు టెక్నీషియన్లతో కలిసి ప్రభాస్ దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2017 జూన్ 9న ‘సాహో’ చిత్రీకరణ ప్రారంభమైంది. భారతీయ అతిపెద్ద యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను పూర్తిచేయడానికి 25 నెలలు పట్టింది. సుజిత్ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రద్ధా కపూర్ కథానాయిక. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. ఇటీవల సినిమాలోని ‘సైకో సయ్యా’ అనే తొలి పాటను విడుదల చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -