ఈ మోడ్రన్‌ యుగంలో దీన్నే టాటూ అంటున్నారు.

0
343

చ్చబొట్టు.. ఈ మోడ్రన్‌ యుగంలో దీన్నే టాటూ అంటున్నారు. తమ అభిరుచులు, ఇష్టాల్ని ప్రతిబింబించేలా శరీరంపై టాటూలు వేయించుకుంటుంటారు. ఒకప్పుడు సెలబ్రిటీలు, ప్రముఖుల శరీరాలపై ఇవి ఎక్కువగా కనిపించేవి. కానీ, ఇప్పుడు ఇది ఓ ట్రెండ్‌లా మారిపోయింది. టాటూ పార్లర్‌లు ఎక్కువైపోయి, ధర అందుబాటులో ఉండటంతో సాధారణ ప్రజలు కూడా వీటివైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, సాధారణ ప్రజల టాటూలతో పోలిస్తే, సెలబ్రిటీల టాటూలపై అందరికీ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వెండితెరపై సందడి చేసిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇలా పచ్చబొట్లు పొడిపించుకున్నవారే. ఇటీవల సమంత తన సీక్రెట్‌ టాటూను కూడా బయటపెట్టారు. కేవలం ఆమే కాదు.. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె, త్రిష, నయనతార, శ్రుతిహాసన్‌ తదితరులు పేర్లు, ఇష్టమైన వాటిని టాటూలుగా వేయించుకున్నారు.

‘లేడీ సూపర్‌స్టార్‌’ నయనతార తన ఎడమచేతికి ‘p’ అని టూటూ వేయించుకున్నారు. దర్శకుడు ప్రభుదేవాతో డేటింగ్‌లో ఉన్నప్పుడు ఆమె తొందరపడి ఈ టాటూ వేయించుకున్నారట. అయితే ఆయనతో విడిపోయిన తర్వాత దాన్ని ‘పాజిటివిటీ’ అని మార్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

తండ్రిపై ప్రేమతో..

బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంకా చోప్రా. ఆమె తన తండ్రిపై ప్రేమకు చిహ్నంగా మణి కట్టుపై ‘daddy”s lil girl..’ అని పచ్చబొట్టు పొడిపించుకున్నారు.

ముచ్చటగా మూడు..

క్షిణాదిలో తిరుగులేని కథానాయిక త్రిష శరీరంపై మొత్తం మూడు పచ్చబొట్లు ఉన్నాయి. తొలుత ఆమె ఎదపై చేప ఆకృతిని, తన రాశి వృశ్చికం (తేలు) కావడంతో ఆ ఆకృతిని చేతిపైన టాటూలుగా వేయించుకున్నారు. తర్వాత 2016లో నటిగా 50 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పచ్చబొట్టు పొడిపించుకున్నారు. భుజంపై కెమెరా, క్లాప్‌బోర్డు టాటూ వేయించుకున్నారు.

తొందపడ్డ దీపిక

ముద్దుగుమ్మ దీపికా పదుకొణె తన మెడ వెనుక భాగంలో ‘RK’ అని పచ్చబొట్టు వేయించుకున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో ఉన్నప్పుడు ఆమె ఈ టాటూ వేయించుకున్నారు. ఆపై ఇద్దరూ విడిపోయారు. దీంతో తర్వాత దీపిక ‘R’ను అలానే ఉంచేసి.. ‘K’ అక్షరాన్ని పువ్వు ఆకృతిలో మార్చేశారు. ఆమె రణ్‌వీర్‌ సింగ్‌ను ప్రేమించి, వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

తన పేరునే..

మల్‌ హాసన్‌ కుమార్తె శ్రుతి హాసన్‌ శరీరంపై మూడు పచ్చబొట్లు ఉన్నాయి. భుజం భాగంలో తన పేరును తమిళంలో టూటూ వేయించుకోగా, చెవి వెనుక మ్యూజిక్‌ నోట్‌ను, ఎడమచేతిపై పువ్వును పచ్చబొట్టు పొడిపించుకున్నారు.

భర్తపై ప్రేమతో..

నాగచైతన్య-సమంతల అనుబంధానికి బీజం వేసిన చిత్రం ‘ఏమాయ చేసావె’. ఆ చిత్రానికి గుర్తుగా మెడ భాగంలో ‘ymc’ అని సామ్‌ పచ్చబొట్టు పొడిపించుకున్నారు. తర్వాత చై, సామ్‌ ఇద్దరూ మణికట్టుపై ఒకే ఆకారంలో టాటూ వేయించుకున్నారు. చైతన్యపై తనకున్న ప్రేమను తెలుపుతూ సామ్‌ పక్క టెముకలపై మరో పచ్చబొట్టు పొడిపించుకున్నారు.

‘క్వీన్‌’కా టాటూ

బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ మెడపై ఎగురుతున్న గద్ద ఆకృతిని టాటూగా వేయించుకున్నారు. అందులోనే రాణులు ధరించే కిరీటం కూడా కనపడుతుంది.

అమలాపాల్‌

ముద్దుగుమ్మ అమలాపాల్‌ తన కుడి కాలిపై టాటూ వేయించుకున్నారు. ఓ వృత్తం నుంచి బాణం దూసుకెళ్తున్న గుర్తును ఆమె పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఈ ఏడాది ఆమె తన వీపుపై కూడా మరో టాటూ వేయించుకున్నారు.

వ్యక్తిత్వం తెలుపుతూ..

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ చేతిపై ఓ పచ్చబొట్టు ఉంటుంది. లాటిన్‌ భాషలో ‘నాకంటూ ఓ మార్గాన్ని వెతుక్కుంటా, లేదంటే నాకు నేనే ఏర్పరచుకుంటా’ అనే అర్థం వచ్చేలా టాటూ వేయించుకున్నారు.

బోల్డ్‌ మీనింగ్‌

టి, నిర్మాత ఛార్మి చేతిపై ‘లిమిటెడ్‌ ఎడిషన్‌’ అని ఒక పచ్చబొట్టూ, కాలిపై స్పానిష్‌ భాషలో ‘నా మనసును గెలిచినప్పుడే.. నన్ను పొందగలవు’ అనే అర్థం వచ్చేలా మరో టాటూ ఉంటుంది.

టపాకాయ

టి ఆలియా భట్‌ తన మెడపై ‘pataka’ అని హిందీలో పచ్చబొట్టు పొడిపించుకున్నారు. తెలుగు దీనర్థం టపాకాయ. తన వ్యక్తిత్వాన్ని తెలుపుతూ ఆమె ఇలా టాటూ వేయించుకున్నారు.

భర్తీ చేయలేరు..

‘మేడమ్‌’ రష్మిక కుడిచేతిపై టాటూ ఉంటుంది. తన వ్యక్తిత్వాన్ని ఉద్దేశిస్తూ.. ‘irreplaceable’ అని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. దీని అర్థం ‘భర్తీ చేయలేరు’ అని.

దైవభక్తి

టి, గాయని మమతా మోహన్‌దాస్‌ తన చేతిపై భుజం వద్ద టాటూ వేయించుకున్నారు. ఓం కారాన్ని, గణపతిని ప్రతిబింబించేలా ఈ పచ్చబొట్టు ఉంటుంది.

డాడీ గర్ల్‌

థానాయిక ప్రియమణి తన ఎడమచేతికి టాటూ ఓ టాటూ ఉంది. తన తండ్రిపై ప్రేమను తెలుపుతూ ‘daddy girl‌’ అని ఆంగ్లంలో పచ్చబొట్టు పొడిపించుకున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌