దౌర్జన్యాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు:చంద్రబాబు

0
49

అమరావతి: సభలో సీఎం ఒక దస్త్రాన్ని చూపించి వివరించినప్పుడు.. మాకూ అవకాశం ఇవ్వాలి కదా ప్రతిపక్షనేత చంద్రబాబు స్పీకర్‌ను కోరారు. మాపై ఆరోపణలు చేసినప్పుడు మేమూ సమాధానం ఇవ్వాలి అని అన్నారు. తాను ప్రస్తుతం నివాసముంటున్న ఇల్లు తనది కాదని, అక్కడ అద్దెకు ఉంటున్నానని చంద్రబాబు అన్నారు. లింగమనేని రమేశ్‌ అనే వ్యక్తి దగ్గర అద్దెకు తీసుకున్నానని చెప్పారు. ‘ప్రజా వేదిక కూడా నా నివాసం కాదు.. ప్రభుత్వానిది’ అని పేర్కొన్నారు. భవనాల కూల్చివేత పట్ల రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొందని, దౌర్జన్యాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైతే రోడ్డుపై పడుకుంటా తప్ప .. ఎవరి బెదిరింపులకు లొంగనని చంద్రబాబు స్పష్టం చేశారు.