అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకుంది

0
59

అమరావతి: అమరావతి సుస్థిర రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకుంది. 300 మిలియన్‌ డాలర్ల రుణ సాయానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేయగా.. దాన్నుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాంక్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీనిపై ప్రపంచబ్యాంక్‌ నుంచి అధికారిక సమాచారమేదీ లేదని సీఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీ నరసింహం పేర్కొన్నారు. రైతులు, ప్రజా సంఘాల ఫిర్యాదుల నేపథ్యంలో ప్రపంచబ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అమరావతి అభివృద్ధి కోసం 715 మిలియన్‌ డాలర్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా 300 మిలియన్‌ డాలర్ల రుణం అందించేందుకు ప్రపంచబ్యాంకు సిద్ధమైంది. ఈ లోపు అమరావతి నగర ప్రాంతంలో నివసిస్తున్న కొందరు ప్రపంచబ్యాంకు తనిఖీ ప్యానెల్‌కు ఫిర్యాదు చేశారు. అమరావతి నగర నిర్మాణం తమ జీవనాధారానికి హాని చేస్తోందని, పర్యావరణానికి, ఆహారభద్రతకు ఇది భంగం కలిగిస్తోందని పేర్కొన్నారు. దీంతో ప్రపంచబ్యాంక్‌ రుణ విషయంలో కాలయాపన చేస్తూ వస్తోంది. చివరికి ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపింది.