మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ది మాయా ప్రభుత్వం అంటూ ట్వీట్ చేశారు. రైతుల పేరుతో జగన్ వికృత రాజకీయం మొదలుపెట్టారని విమర్శించారు. అడ్డదిడ్డమైన లెక్కలు చెబుతూ.. అసెంబ్లీలో అడ్డంగా దొరికిపోయారని అన్నారు. బడ్జెట్ కాగితాల్లో 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి.. ఇప్పుడు 391 మందివి మాత్రమే ఆత్మహత్యలని తేల్చారని విమర్శించారు. అసెంబ్లీలో 1160 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతూ.. అందులో 454 మందివి ఆత్మహత్యలని తేల్చారని పేర్కొన్నారు. ‘‘టీడీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలంటూ దొంగలెక్కలు చెప్పడం మాని.. మీ నాన్న హయాంలో చనిపోయిన 15వేల మంది రైతులకు ఓదార్పునివ్వాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్కు లోకేష్ దుయ్యబట్టారు.