ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రేమలో పడ్డారా?

0
45

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రేమలో పడ్డారా?పై ఫొటోలో ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు? ఆమె ప్రియుడా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటో చూసి నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలు ఇవి. సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పాయల్‌ ఈ ఫొటోను పోస్ట్‌ చేశారు. అయితే ఎలాంటి క్యాప్షన్‌ ఇవ్వకుండా ఏదో కోడ్‌ భాషలా నాలుగు గీతలను జత చేశారు. దాంతో నెటిజన్లు ఆమె ప్రియుడై ఉంటాడంటూ కామెంట్లు పెడుతున్నారు. అదీకాకుండా కామెంట్స్‌ ఎక్కువగా కనిపించకుండా పాయల్‌ కొన్ని బ్లాక్‌ చేసేశారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో పాయల్‌ చెప్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. ప్రస్తుతం ఆమె ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె వెంకటేశ్‌కు జోడీగా నటిస్తున్నారు. దీంతో పాటు ‘ఆర్‌డీఎక్స్‌’, రవితేజకు జోడీగా ‘డిస్కో రాజా’ చిత్రాల్లో నటిస్తున్నారు.