టబు కీలక పాత్రలో త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం

0
39

హైదరాబాద్‌: స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. టబు సెట్‌లో స్క్రిప్ట్‌ చదువుతున్నప్పుడు తీసిన వీడియోను షేర్‌ చేసింది. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. వినోదాత్మకమైన కుటుంబ నేపథ్య చిత్రంగా తెరకెక్కబోతోందని చిత్రవర్గాలు వెల్లడించాయి. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.