ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథను సినిమాగా:విజయ్‌ సేతుపతి

0
58

చెన్నై: ప్రఖ్యాత క్రికెటర్లలో ఒకరైన ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ముత్తయ్య పాత్రను విజయ్‌ సేతుపతి పోషిస్తుండటం విశేషం. డార్‌ మోషన్‌ ఫిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా గురించి నిర్మాణ వర్గాలు స్పందిస్తూ.. క్రికెట్‌ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథను సినిమాగా తెరకెక్కించడం ఆనందంగా ఉంది. దక్షిణ భారత దేశంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ సేతుపతి ఇందులో ముత్తయ్య పాత్ర పోషిస్తున్నారు. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. ముత్తయ్య మురళీధరన్‌ మాట్లాడుతూ ‘నా జీవిత కథ తెరపైకి రానుందనే విషయం వింటేనే చాలా ఆనందంగా ఉంది. 2020లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్‌సేతుపతి వంటి అంకితభావమున్న నటుడు నా పాత్ర పోషించడం మరింత గౌరవంగా ఉందని’ చెప్పారు. విజయ్‌ సేతుపతి స్పందిస్తూ ‘మురళీధరన్‌ పాత్రలో నటించడం కెరీర్‌లోనే ఓ గొప్ప విషయం. చాలా గౌరవంగా భావిస్తున్నా. వాస్తవానికి ఆయన పాత్ర పోషించడం సవాలుతో కూడుకున్న విషయమని’ పేర్కొన్నారు.