వెజిటబుల్‌ ఫూల్‌మఖానా కూర

0
86

కావలసినవి

ఫూల్‌మఖానా: కప్పు, ఆలూ: అరకప్పు, టొమాటోముక్కలు: అరకప్పు, కాలీఫ్లవర్‌ ముక్కలు: అరకప్పు, క్యారెట్‌ముక్కలు: అరకప్పు, చిక్కుడుకాయ లేదా బీన్స్‌ముక్కలు: అరకప్పు, తాజాబఠాణీలు: అరకప్పు, ఉల్లిముక్కలు: అరకప్పు, పచ్చిమిర్చి: ఎనిమిది, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, గరంమసాలా: టీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, పసుపు: చిటికెడు, ఉప్పు: తగినంత, కారం: టీస్పూను, నూనె: తగినంత, జీడిపప్పు: పది

తయారుచేసే విధానం
ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేసి ఫూల్‌మఖానాలు వేసి వేయించి తీయాలి. ప్రెషర్‌పాన్‌లో తగినంత నూనె వేసి అల్లంవెల్లుల్లి, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. తరవాత కూరగాయల ముక్కలు ఒకదాని తరవాత ఒకటి వరసగా వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్‌ మూతపెట్టి ఓ విజిల్‌ రానివ్వాలి. తరవాత వేయించిన ఫూల్‌మఖానా కూడా వేసి అవసరమైతే కాసిని నీళ్లు చిలకరించి మగ్గనివ్వాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, గరంమసాలా, కొత్తిమీర తురుము వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా వేయించిన జీడిపప్పు కూడా వేసి దించాలి.