చెన్నై, న్యూస్‌టుడే: తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రో కేంద్రంపై అనుమానిత విమానాలు తిరిగిన విషయం చర్చనీయాంశమైంది. ఇస్రోకు చెందిన ప్రొపుల్షన్ కాంప్లెక్స్ తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉంది. ఉపగ్రహ ప్రయోగాలకు అవసరమైన జీఎస్‌ఎల్వీ రాకెట్ ఇంజిన్లు, విడిభాగాలను ఇక్కడే తయారు చేస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఆర్‌పీఎఫ్) రక్షణ వలయంలోని ఈ కేంద్రంపై శనివారం తెల్లవారుజామున రెండు అనుమానిత విమానాలు తిరిగినట్లు విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్ సిబ్బంది స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి అధికారులు వెంటనే దిల్లీలోని ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని చేరవేశారు. వారి సూచన మేరకు పణకుడి పోలీసులకు సీఆర్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ రవీంద్రన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. 2015లో మానవ రహిత విమానం ఒకటి ఇదే రీతిగా వెళ్లింది. మళ్లీ 2017 ఆగస్టు 24, సెప్టెంబరు 25 తేదీల్లోనూ అనుమానిత విమానాలు ఇదే విధంగా తిరగడం గమనార్హం.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -