హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఎల్వీప్రసాద్ ఆస్పత్రి, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి మీదుగా గాంధీభవన్‌కు తీసుకొస్తారు. ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం గంటపాటు అక్కడే ఉంచుతారు. అనంతరం నెక్లెస్‌రోడ్డులోని పీవీ ఘాట్ సమీపంలో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈమేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. జైపాల్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన గ్రామస్థులు, పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. ఇవాళ ఉదయం తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్, మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తెరాస నేతలు హరీశ్‌రావు, బూరనర్సయ్యగౌడ్, కాంగ్రెస్‌నేత భట్టివిక్రమార్క తదితరులు జైపాల్‌రెడ్డి నివాసానికి చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు.