ముల్లంగి చట్నీ

0
34
కావలసిన పదార్థాలు
ముల్లంగి- పావు కిలో (సన్నగా తురుముకోవాలి), ఉల్లిపాయ- ఒకటి, మినప్పప్పు- 2 టీ స్పూన్లు, శనగపప్పు- ఒక టీ స్పూను, ఎండుమిర్చి- 4, పసుపు- చిటికెడు, ఇంగువ- చిటికెడు, చింతపండు- నిమ్మకాయంత సైజులో, నూనె- 2 టీ స్పూన్లు, ఆవాలు- అర టీ స్పూను, కరివేపాకు- కొద్దిగా, ఉప్పు- తగినంత.
తయారీ విధానం
బాణలిలో ఒక టీ స్పూను నూనె పోసి వేడెక్కాక మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి వేసి రెండు నిముషాలు వేగించాలి. తర్వాత బాణలిలోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో ముల్లంగి తురుము, ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగించి, దించి చల్లారనివ్వాలి. తర్వాత వేగించిన పప్పులు, చింతపండు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఒక చిన్న బాణలిలో మిగిలిన నూనె పోసి ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకుని చట్నీలో కలపాలి.