వారిద్దరూ ప్రవాస భారతీయ మహిళలు

0
57

వారిద్దరూ ప్రవాస భారతీయ మహిళలు. ఇద్దరికీ అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్‌లో జరగనున్న 2019 విమెన్‌ ఆఫ్‌ కలర్‌ సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ అండ్‌ మాథ్స్‌(స్టెమ్‌) సదస్సులో పురస్కారాలు అందుకోనున్నారు. స్టెమ్‌ విభాగంలో అత్యుత్తమంగా రాణిస్తున్న 50 మందికి పైగా మహిళల్ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అందులో ఒకరు… బోయింగ్‌ కంపెనీ డిజిటల్‌ కామన్‌ సర్వీసెస్‌ సీనియర్‌ డైరెక్టర్‌ మోనికా పంపాలియా. ఆమె ‘డైవర్సిటీ లీడర్‌షిప్‌-గవర్నమెంట్‌’ అవార్డుకు ఎంపికయ్యారు. మోనిక పుణెలో ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేశారు. వాషింగ్టన్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. ఆరేళ్లుగా బోయింగ్‌ కంపెనీలో పని చేస్తున్నారు. ఆమెతోపాటు భారతదేశానికి చెందిన మనాలిని సైతం ఈ అవార్డును అందుకోనున్నారు. పుణెలో చదివిన ఆమె క్వికెన్‌ లోన్స్‌లో ఏడేళ్లుగా చేస్తున్నారు. అదే సంస్థలో రాకెట్‌ మార్టిగేజ్‌ టెక్నాలజీకి ఆరునెలల నుంచి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సదస్సులో అవార్డులు అందుకోబోతున్న మహిళలు ప్రభుత్వ, పారిశ్రామిక రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి వివిధ సంస్థలు, సంఘాలను బలోపేతం చేయడంలో తమ వంతు పాత్ర పోషించారని చెబుతున్నారు స్టెమ్‌ సదస్సు నిర్వాహకులు.