కాఫీ కింగ్ సిదార్ద మృతికి.. కారణం ఎవరు..?

0
48

ముంబయి: కేఫ్‌ కాఫీ డే యజమాని సిద్ధార్థ మృతిపై పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సిద్ధార్థ మరణానికి కారణం ఎవరో తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేపట్టాలని కోరారు.

‘దేశవ్యాప్తంగా 1700 కాఫీడే అవుట్‌లెట్స్‌కు యజమాని అయిన సిద్ధార్థ మృతదేహం ఓ నదిలో లభించింది. ఆయన మృతికి ఎవరు కారణం..? మోదీ ప్రభుత్వమా? ఐటీ అధికారులా? లేదా ప్రైవేటు ఈక్విటీ భాగస్వాములా? దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టాలి. అందరు వ్యాపారవేత్తలూ దొంగలు కాదు’ అని నిరుపమ్‌ ట్వీట్‌ చేశారు.

రెండు రోజులుగా కన్పించకుండా పోయిన కాఫీడే వ్యవస్థాకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌.ఎం కృష్ణ అల్లుడు వి.జి. సిద్ధార్థ మృతదేహం ఈ ఉదయం నేత్రావతి నదిలో లభ్యమైంది. వంతెనపై నుంచి ఓ వ్యక్తి దూకడం తాను చూశానని స్థానిక జాలరి ఒకరు వెల్లడించారు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.