కొత్తూరు : విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువు ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. మండలంలోని ఓ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన చెందిన ఉపాధ్యాయుడు సమాజంలో తలదించుకునేలా వ్యవహరించాడు. విద్యార్థిని తనకు పుస్తకాలు కావాలని అడగడంతో ఆ ఉపాధ్యాయుడు మంగళవారం పాఠశాల సమయంలోనే ఆమెను పుస్తకాల గదిలోకి పిలిచాడు. అడిగిన పుస్తకాలు లేవని, మరోసారి ఇస్తానని చెబుతూనే అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తీవ్రంగా ఆవేదనతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసింది. దీనిపై ఆగ్రహంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు ఉపాధ్యాయుడికి గట్టిగా బుద్ధి చెప్పాలని బుధవారం పాఠశాలకు చేరుకున్నారు. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన అతను పాఠశాలకు నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సైతం పాఠశాలకు వెళ్లి వివరాలను సేకరించినట్లు తెలిసింది. ఈ సంఘటనపై ప్రధాన ఉపాధ్యాయులకు, పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -