సొరకాయ మినప్పప్పు గారెలు

0
39

కావల్సినవి: 

సొరకాయ- ఒకటి చిన్నది, మినప్పప్పు-రెండు కప్పులు, పచ్చిమిర్చి-రెండు, జీలకర్ర- చెంచా, కరివేపాకు- రెండు రెబ్బలు, అల్లం ముక్క- చిన్నది, నూనె- వేయించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.

తయారీ: 

మినప్పప్పును నాలుగు గంటల పాటు నానబెట్టి నీళ్లు ఒంపేసి గారెల పిండిలా రుబ్బిపెట్టుకోవాలి. సొరకాయ చెక్కు తీసి తురమాలి. దీనికి కొద్దిగా ఉప్పు కలిపి శుభ్రమైన వస్త్రంలో మూటకట్టి అరగంట పాటు ఉంచితే.. అందులోని నీరంతా పోతుంది. ముందుగా రుబ్బిపెట్టుకున్న మినప్పిండిలో ఈ తురుమూ, పచ్చిమిర్చి ముక్కలూ, జీలకర్రా, కరివేపాకు తరుగూ, అల్లం తరుగూ, తగినంత ఉప్పూ వేసుకుని బాగా కలపాలి. దీన్ని కొద్దిగా కొద్దిగా తీసుకుని గారెల్లా చేసుకుని కాగే నూనెలో వేయించి తీసుకోవాలి. ఇవి వేడివేడిగా తింటే బాగుంటాయి.