వయసు అయిపోయిన నటీమణులు తల్లి పాత్రల్లో నటించాల ?

0
59

ముంబయి: పాకిస్థాన్‌ నటి మహీరా ఖాన్‌ పాత్రల ఎంపికపై బుల్లితెర నటుడు ఫిర్దాస్‌ జమాల్‌ కామెంట్‌ చేశారు. 34 ఏళ్ల ఆమె హీరోయిన్ పాత్రలు చేయకూడదని ఉచిత సలహాలు ఇచ్చారు. ‘వయసు అయిపోయిన నటీమణులు తల్లి పాత్రల్లో నటించాలి. హీరోయిన్‌ పాత్రల్లో కాదు’ అని అన్నారు. దీనిపై స్పందిస్తూ మహీరా ఓ లేఖ రాశారు. దాన్ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

‘మనం ప్రస్తుతం వర్తమానంలో ఉన్నాం. మనం చేసే పనులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ విషయంలో నాకు మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు. నాకు సపోర్ట్‌ చేయమని మిమ్మల్ని (నెటిజన్లను ఉద్దేశిస్తూ) నేను అడగలేదు. అయినా మీరు స్పందించారు.. సంతోషంగా ఉంది. ఓ నటిగా చిత్ర పరిశ్రమ పట్ల నేను గర్వపడుతున్నా. మాలాంటి నటీమణులకు మార్గదర్శకంగా ఉన్న సీనియర్లకు కృతజ్ఞతలు. నా పట్ల కూడా నేను గర్వపడుతున్నా. నా ఈ ప్రయాణంలో నా మనసుకు నచ్చిన విధంగా ఉన్నానని గర్వంగా చెబుతున్నా. నాకు ఇది సరైందని ఎదుటి వ్యక్తి చెబితే నేను వినను. ఇకపై కూడా ఇలానే కొనసాగుతా. ఈ ప్రపంచం ద్వేషంతో నిండిపోయింది. మనం ప్రేమను పంచుదాం. ఇతరుల ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాడుదాం’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ నటించిన ‘రయీస్‌’ సినిమాలో మహీరా కథానాయిక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.