రాజీవ్ కనకాలకు పితృ వియోగం

0
87

నటుడు రాజీవ్ కనకాల తండ్రి.. స్టార్ యాంకర్ సుమ కనకాల మామగారు దేవదాస్ కనకాల కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన తుదిశ్వాస విడిచారు. ఈయన నటుడిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలను, నటులను పరిచయం చేసిన నటగురువు దేవదాస్. ఈయన పేరుతో ఓ యాక్టింగ్ స్కూల్ ఉంది. అక్కడే ఎందరో నటులు శిక్షణ తీసుకున్నారు. ఈయనతో ట్రైనింగ్ తీసుకున్న వాళ్లలో గొప్పగొప్ప నటులు కూడా ఉన్నారు.

 

దేవదాస్ కనకాల ఫైల్ ఫోటో

స్టార్ హీరోలు కూడా చాలా మందే ఉన్నారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి నటులతో పాటు ఇంకా చాలా మంది ఆయన నట పాఠశాలలో శిక్షణ తీసుకున్న వాళ్లే. 1945లో జూలై 30న యానంలో జన్మించారు. దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. విశాఖపట్టణంలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు.

దేవదాస్ కనకాల ఫైల్ ఫోటో

సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్‌లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే. దర్శకుడిగా కూడా ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు. రెండేళ్ల కింద దేవదాస్ కనకాల భార్య చనిపోయారు. అప్పట్నుంచి ఆయన ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉందంటున్నారు సన్నిహితులు. ఆయన వయసు 74 ఏళ్ళు.