నిజ జీవితంలోనూ నేను జీనీ లాంటి వాడినే..

0
92

వాల్ట్‌ డిస్నీ నిర్మాణంలో గారు రిట్చరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమెరికన్‌ మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘అలాద్దీన్‌’. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను శనివారం వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ సంయుక్తంగా విడుదల చేశారు. ఇందులో జీనీగా ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ కనిపించనున్నాడు. అలాద్దీన్‌గా మేనా మసూద్‌, ప్రిన్స్‌ జాస్మిన్‌గా నయోమి స్కాట్‌ అలరించనున్నారు. జీనికి తెలుగులో హీరో వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వగా అల్లాదిన్‌కు వరుణ్‌తేజ్‌ డబ్బింగ్‌ చెప్పారు. ఈ సినిమా ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేష్‌ మాట్లాడుతూ ‘జీనీ క్యారెక్టర్‌కి వాయిస్‌ ఇవ్వడం అనేది చాలా డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌. అంత పెద్ద సినిమాతో అసోసియేట్‌ అవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆ పర్సనాలిటీ లైక్‌ మెంటోస్‌ అలా పర్‌ఫెక్ట్‌ క్యారెక్టర్‌కి ఇచ్చాను. ఫస్ట్‌టైం ఒక క్యారెక్టర్‌కి వాయిస్‌ ఇచ్చాను. మొదట్లో కొంచం కష్టమనిపించింది ఎందుకంటే చాలా మ్యాజిక్‌, ఫన్‌ ఉన్న క్యారెక్టర్‌ అది. జీనీ బాడీల్యాంగ్వేజ్‌ చాలా క్రేజీగా ఫన్నీగా ఉంటుంది. సినిమా మొత్తం మ్యాజికల్‌ టైం చాలా ఫాస్ట్‌గా ఉంటారు ఆయన. నేను ఒకసారి పాత్రలోకి ఎంటర్‌ అయ్యాక చాలా ఎంజారు చేస్తూ డబ్బింగ్‌ చెప్పాను. మన తెలుగువాళ్ళు చాలా బాగా ఎంజారు చేస్తారు. నాకు కూడా కామెడీ చేయడం చాలా ఇష్టం. మీరు సినిమా చూస్తే తప్పకుండా క్రేజీగా ఫీలవుతారు. నా క్యరెక్టర్‌లోనే ఒక చిన్న థ్రిల్‌ ఉంది. నాకు తెలియకుండానే ఇటీవలె వచ్చిన ఎఫ్‌-2లో వరుణ్‌కి ఒక మెంటోన్‌లాగా గైడ్‌లాగా ఉన్నాను. ఇందులో కూడా నేను తనకు సహాయపడతాను, గైడ్‌ చేస్తాను తెలియకుండానే ఈ ప్రాసెస్‌లో చాలా ఫ్రెండ్‌షిప్‌ కూడా ఏర్పడింది. ‘ఎఫ్‌2’లో వరుణ్‌ను కొంచం టీజ్‌ చేసినా తర్వాత గైడ్‌ చేస్తూనే ఉన్నాను. నిజ జీవితంలోనూ నేను జీనీ లాంటి వాడినే నా పిల్లలకు ఏం కావాలంటే అది ఇచ్చాను. మాడ్యూలేషన్‌ కోసం కొంచం హోమ్‌ వర్క్‌ చేశాం. ఇకపైన కూడా మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమాలు వస్తే తప్పకుండా చేస్తాం” అన్నారు.

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘నాకు నిజజీవితంలో నిజంగా జీనీ లాంటి క్యారెక్టర్‌ వచ్చి కోరుకోమంటే ఈ వరల్డ్‌లో అందరు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. నేను చిన్నప్పటి నుంచి పిల్లల స్టోరీలు చూడడం చాలా ఇష్టపడతాను. నేను మా చెల్లి కలిసి అలాంటి సినిమాలు, గేమ్స్‌ అన్నీ చూసేవాళ్ళం. నాకు ఇంత మంచి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మొత్తం సినిమాలో నా డబ్బింగ్‌ ఉండడం చాలా ఆనంగా ఉంది. నేను ఆల్రెడీ మూవీ చూశాను. నా క్యారెక్టర్‌ కూడా చాలా ఫవర్‌ఫుల్‌. సినిమా చూసినప్పటినుంచీ భలే ఉంది అనిపించింది. ‘ఎఫ్‌2’ జర్నీ అలాద్దీన్‌ చాలా డిఫరెంట్‌ మూవీ. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాకి డబ్బింగ్‌ చెప్పడం అనేది చాలా ఛాలెంజింగ్‌గానే ఉంది. నేను నటించిన చిత్రాలకు కూడా డబ్బింగ్‌ టైంలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్‌ వచ్చేసరికి మేం నటించలేదు. ఆ అబ్బాయి ఎక్స్‌ప్రెషన్స్‌ని పట్టుకుని చెయ్యడం మధ్య మధ్యలో వెంకటేష్‌ చేసింది చూడడం అలా చేశాను. నేను ఈ క్యారెక్టర్‌కి డబ్బింగ్‌ చెప్పకముందు వెంకటేష్‌గారు చెపుతున్నారని తెలిసింది. ఆయన అంటే ఇంక ఆలోచించలేదు. ఆయనతో కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.