66 వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈసారి తెలుగు సినిమా తన సత్తాను చాటింది. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ నటి అవార్డులను మహానటి గెలుచుకుంది. ఉత్తమనటిగా కీర్తి సురేష్ ఎంపికైంది. ఉత్తమ స్క్రీన్ ప్లే తో పాటు వివిధ కేటగిరిలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. 66 వ జాతీయ చలన చిత్ర అవార్డుల పూర్తి లిస్ట్…
ఉత్తమ నటి: కీర్తిసురేశ్(మహానటి)
జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి
జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్
జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్
ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)
జాతీయ ఉత్తమ యాక్షన్ చలన చిత్రం: కేజీఎఫ్
ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్)
ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం: చి||ల||సౌ||
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ‘అ!'(తెలుగు)కేజీఎఫ్(కన్నడ)
ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ మేకప్: ‘అ!’
ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్: మహానటి
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కమ్మార సంభవం(మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ సౌండ్ డిజైనింగ్: ఉరి
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీప్‌ప్లే: అంధాధున్
ఉత్తమ సంభాషణలు: తారీఖ్(బెంగాళీ)
ఉత్తమ గాయని: బిందుమలినిఫ్(నాతి చరామి: మాయావి మానవే)
ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్(పద్మావత్: బింటే దిల్)
ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్, షాహిబ్ సింగ్, తలాహ్ అర్షద్ రేసి, శ్రీనివాస్ పోకాలే