మలేసియాలో అదృశ్యమైన ఫ్రాంకో-ఐరిష్ బాలిక నోరా కొయిరిన్(15) మృతి చెందినట్టు గుర్తించారు. నెగ్రిసెంబిలాన్ రాష్ట్రంలోని ‘డుసన్ ఫారెస్ట్ ఎకోరిసార్ట్’ నుంచి ఈ నెల 4న ఆమె అదృశ్యమైంది. చిన్నారి కోసం మలేసియా పోలీసులు అడవంతా జల్లెడ పట్టారు. రిస్టార్‌కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో నీటి ప్రవాహంలో రాయిపై నగ్నంగా పడివున్న బాలిక మృతదేహాన్ని కనుగొన్నట్టు మలేసియా జాతీయ పోలీసు విభాగం డిప్యూటీ చీఫ్ మజ్లాన్ మన్సూర్ తెలిపారు. మృతదేహాన్ని హెలికాప్టర్‌లో ఆస్పత్రి తరలించినట్టు చెప్పారు. బాలిక శరీరంపై గాయాలేమైనా ఉన్నాయా అనే దానిపై వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. చనిపోయిన బాలిక నోరా కొయిరిన్‌గా ఆమె తల్లిదండ్రులు ధ్రువీకరించారు. బాలిక మరణానికి గల కారణాలు పోస్ట్‌మార్టం తర్వాత వెల్లడయ్యే అవకాశముంది. చిన్నారిని ఎవరైనా హత్య చేశారా, అడవిలోని పరిస్థితుల వల్ల ఆమె చనిపోయిందా అనేది వెల్లడి కావాల్సి ఉంది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -