ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు మరో పరీక్ష.

0
35

ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో సొంతగడ్డపై తొలి టెస్టులో భారీ తేడాతో ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు మరో పరీక్ష. ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో బుధవారం నుంచి ఆ జట్టు ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో తలపడనుంది. వన్డే ప్రపంచ కప్‌ గెలిచిన ఊపులో యాషెస్‌ బరిలో దిగిన ఆతిథ్య జట్టుకు మొదటి టెస్టులో తలబొప్పి కట్టింది. తమతో పోలిస్తే బలహీనంగా ఉన్న ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూల్చేలా కనిపించిన ఇంగ్లండ్‌ తర్వాత స్టీవ్‌ స్మిత్‌ను అడ్డుకోలేక చేతులెత్తేసి ఏకంగా 251 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌కు అసలు ముప్పు స్మిత్‌తోనే. ప్రధాన పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ గాయంతో దూరమైనందున యువ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ టెస్టు అరంగేట్రం ఖాయమైంది.

పేసర్‌ ప్యాటిన్సన్‌కు విశ్రాంతినిచ్చిన ఆస్ట్రేలియా… మిషెల్‌ స్టార్క్, హాజల్‌వుడ్‌లతో 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ టెస్టులోనూ ఓడితే సిరీస్‌లో ఇంగ్లండ్‌ పుంజుకోవడం కష్టమే. యాషెస్‌ చరిత్రలో తొలి టెస్టు ఓడినా ఆ జట్టు సిరీస్‌ నెగ్గిన సందర్భాలు తక్కువ.