‘వీర చక్ర’ పురస్కారాన్నిఅందుకోబోతున్న భారత కమాండర్‌ అభినందన్‌..

0
71

దేశ 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభ వేళ భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌‌‌కు భారత ప్రభుత్వం ‘వీరచక్ర’ పురస్కారం ప్రదానం చేయనుంది. గురువారంనాడు ‘వీర చక్ర’ పురస్కారాన్ని అభినందన్ అందుకోనున్నారు. గత ఫిబ్రవరి 26న తాను ప్రయాణిస్తున్నమిగ్ విమానంతో అభినందన్‌ కూల్చివేశారు. ఆ తర్వాత తన మిగ్‌ కూడా కూలిపోవడంతో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దిగాడు. స్థానికులు ఆయన్ను పట్టుకుని పాక్ సైన్యానికి అప్పగించారు. వారు ఎంత ఒత్తిడి చేసినా మిలిటరీకి సంబంధించిన ఎలాంటి సున్నిత సమాచారాన్ని ఆయన బయటపెట్టలేదు. తర్వాత భారత్ సహా ప్రపంచ దేశాలు ఒత్తిడి చేయడంతో పాకిస్థాన్ ప్రభుత్వం వర్థమాన్‌ను వాఘా సరిహద్దు వద్ద అప్పగించింది. అభినందన్‌ చూపించిన సాహసం ఒక్కసారిగా ఆయనను రియల్ హీరోను చేసింది. సాహసానికి ప్రతీకగా, భారత్‌కు ఓ బ్రాండ్‌గా ఆయన పేరు మారుమోగింది. అభినందన్‌కు భారత అత్యున్నత అవార్డైన వీర చక్ర ఇవ్వాలని కోరుతూ భారత వాయుసేన నామినేట్ చేసింది. కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. తమిళనాడు సీఎం సైతం పళనిస్వామి సైతం ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేశారు. ఆయన ప్రదర్శించిన ధైర్య పరాక్రమాలకు గాను ‘వీర్ చక్ర’ పురస్కారం ఆయనను వరించింది. సైన్యానికి పరమ్ వీర చక్ర, మహా వీర చక్ర తర్వాత ఇది మూడో అత్యున్నత పురస్కారం.