నోరా కొయిరిన్‌ మృతి చెందినట్టు గుర్తించిన మలేసియా పోలీసు

0
39

మలేసియాలో అదృశ్యమైన ఫ్రాంకో-ఐరిష్‌ బాలిక​ నోరా కొయిరిన్‌(15) మృతి చెందినట్టు గుర్తించారు. నెగ్రిసెంబిలాన్‌ రాష్ట్రంలోని ‘డుసన్‌ ఫారెస్ట్‌ ఎకోరిసార్ట్‌’ నుంచి ఈ నెల 4న ఆమె అదృశ్యమైంది. చిన్నారి కోసం మలేసియా పోలీసులు అడవంతా జల్లెడ పట్టారు. రిస్టార్‌కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో నీటి ప్రవాహంలో రాయిపై నగ్నంగా పడివున్న బాలి​క మృతదేహాన్ని కనుగొన్నట్టు మలేసియా జాతీయ పోలీసు విభాగం డిప్యూటీ చీఫ్‌ మజ్లాన్‌ మన్సూర్‌ తెలిపారు. మృతదేహాన్ని హెలికాప్టర్‌లో ఆస్పత్రి తరలించినట్టు చెప్పారు. బాలిక శరీరంపై గాయాలేమైనా ఉన్నాయా అనే దానిపై వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. చనిపోయిన బాలిక నోరా కొయిరిన్‌గా ఆమె తల్లిదండ్రులు ధ్రువీకరించారు. బాలిక మరణానికి గల కారణాలు పోస్ట్‌మార్టం తర్వాత వెల్లడయ్యే అవకాశముంది. చిన్నారిని ఎవరైనా హత్య చేశారా, అడవిలోని పరిస్థితుల వల్ల ఆమె చనిపోయిందా అనేది వెల్లడి కావాల్సి ఉంది.