స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని మేరీమాత పాఠశాలలో త్రివర్ణ పతాకాన్ని కర్రపై ఎగరవేయకుండా ఓ తాడుతో వేలాడదీశారు. జాతీయ జెండాకు కుడి వైపున త్రివర్ణ పతాకం కంటే ఎత్తులో కర్రకు శిలువ గుర్తు ఉంది. జాతీయ పతాక నియమావళి ప్రకారం.. జాతీయ జెండాకు కుడి వైపున మరే జెండాగానీ, మరే చిహ్నం కానీ ఎగరడానికి వీల్లేదు.
దీంతో దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీశారంటూ బీజేపీ, విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు గురువారం పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు. స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చేగుంట-మెదక్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. స్కూలు లైసెన్సును రద్దు చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని ఎస్‌ఐని కోరారు.