ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. చుట్టూ ఐపీఎస్, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. సైగ చేస్తే చాలు ఆదేశాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినా ఏ మాత్రం దర్పం ప్రదర్శించని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా పతకాలు ముఖ్యమంత్రి అందచేశారు. ఈ సందర్బంగా ఓ పోలీస్ అధికారికి పతకాన్ని అలంకరించారు. సీఎంకు శాల్యూట్ చేసే సమయంలో ఆ పతకం పోలీస్ అధికారి నుంచి జారి పడింది. దీనిని గమనించకుండా ఆ అధికారి కవాతు చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జారిపడిన ఆ పతకాన్ని సమీపంలో ఉన్న మరో అధికారి చేతికి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్పింగ్ వైరల్ కావడంతో సీఎం వ్యవహరించిన తీరుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -