ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర సింగ్ అనే వ్యక్తి దేశంలోనే అత్యంత పొడుగైన వ్యక్తి గా గుర్తింపు పొందారు. ఆయన ఎత్తు 8 అడుగుల 1 అంగుళం. ధర్మేంద్ర గత కొద్దిరోజులుగా తుంటి సమస్యతో బాధపుడుతున్నారు. వైద్యులను సంప్రదించగా తుంటి మార్పిడి ఆపరేషన్ చేయాలని, ఇందు కోసం దాదాపు రూ. 8లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు. ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేని ధర్మేంద్ర తనకు సహాయం చేయాలని సీఎం యోగిని కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ధర్మేంద్ర శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవటానికి ఆయన కార్యాలయానికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన అందుబాటులో లేరు. దీంతో నేను వెనక్కు తిరిగిరాక తప్పలేదు. నా ఆపరేషన్‌కు కొంత సహాయం చేయాలని ముఖ్యమంత్రికి గతంలోనే లేఖ రాశాను. ఆయన ప్రభుత్వం తరుపున సహాయం చేస్తానని చెప్పారు. సహాయం తప్పకుండా అందుతుందనే నమ్మకం నాకుంది.’’ అని ఆయన అన్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -