భక్తులకు వరాలు ఇవ్వడానికి జలం వీడి జనంలోకి రావటమా..!

0
72

మిళనాడులోని కాంచీపురం..! ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందిన పుణ్యప్రదేశం. వెయ్యికి పైగా దేవాలయాలున్న ఆధ్యాత్మిక ప్రాంతం. నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. సాధారణంగానే సందడిగా కనిపించే కంచి…ఇప్పుడు మరింత కళ సంతరించుకుంది. భక్తుల సంఖ్య .. వేలు దాటి లక్షలకు చేరింది. కారణం.. దివ్య మంగళ స్వరూపమైన అత్తివరదరాజ స్వామి విగ్రహం…జలం వీడి జనంలోకి రావటమే..! 40 ఏళ్లకోసారి మాత్రమే కనిపించే ఈ అరుదైన దృశ్యం చూసేందుకు… భక్తులు దేశ నలుమూలల నుంచి కంచికి వరస కట్టారు. జీవితంలో ఒక్కసారైనా స్వామివారి తేజోమయమైన రూపం చూడాలని.. వేయి కళ్లతో నిరీక్షించిన వారంతా ఆలయానికి పోటెత్తారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు స్వామివారిని దర్శించుకుని తరించారు.

భక్తులకు వరాలు ఇవ్వడానికి దేవుడు దిగి వచ్చిన కథలు మనం విన్నాం. కానీ ఈయన చాలా ప్రత్యేకం. 40 ఏళ్ల ఎదురు చూపులకు తెర దించాడు. నీటి నుంచి పైకి వచ్చి మరీ  అనుగ్రహిస్తున్నాడు. తమిళుల ఆరాధ్య దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే దైవంగా కాంచీపురంలో కొలువైన వరదరాజ పెరుమాళ్‌ కథ ఇది.