దిల్లీ: పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌పై కేంద్ర జలవనరుల శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని నివేదిక కోరింది. దీనివల్ల ప్రాజెక్టు జాప్యం కావడంతోపాటు, వ్యయం కూడా పెరుగుతుందని అటు కేంద్ర మంత్రి, ఇటు అథారిటీ చెప్పినా.. ఏపీ ప్రభుత్వం పాత కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవడానికి దారి తీసిన కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రస్తుతం నివేదిక తయారీలో నిమగ్నమైంది. ఈ వారంలోపు దాన్ని ఆయనకు అందించనుంది. ఇప్పటివరకు పోలవరం నిర్మాణం సాగిన తీరు, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నుంచి అందులో వచ్చిన మార్పులు, టెండర్ రద్దు వల్ల ఎదురయ్యే సమస్యలన్నింటినీ నివేదికలో పొందుపరచనున్నట్లు తెలిసింది. ఇందులో తామేమీ అభిప్రాయాలు జోడించబోమని, ఇప్పటివరకూ చోటుచేసుకున్న వాటిని మాత్రమే పొందుపరుస్తామని పీపీఏ అధికారులు వెల్లడించారు. ఈ నెల 2న లోక్‌సభలో ఆనకట్టల రక్షణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ పోలవరం రివర్స్ టెండర్లు ప్రాజెక్టు నిర్మాణానికి అవరోధంగా మారతాయని వ్యాఖ్యానించారు. దానివల్ల ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్నారు. ఈ నెల 14న గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి వెల్లడిస్తున్న సందర్భంగా విలేకర్లు రివర్స్ టెండరింగ్‌పై గజేంద్రసింగ్‌ను ప్రశ్నించారు. ‘‘అన్నీ గమనిస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని ఆయన బదులిచ్చారు. ఈ నేపథ్యంలో రీటెండర్ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఈ నెల 16న పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దాన్ని బేఖాతరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరుసటిరోజే కొత్త టెండర్లను పిలుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర జలవనరుల శాఖ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక కోరినట్లు సమాచారం.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -