హీరో తరుణ్ కారు ప్రమాదానికి గురైంది క్లారిటీ ఇచ్చిన తరుణ్.

0
61

నార్సింగ్‌ పీఎస్ పరిధిలోని అల్కాపూర్‌లో హీరో తరుణ్ కారు ప్రమాదానికి గురైంది. ప్రదీప్ పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి గురైన కార్ నెంబర్: TS09EX1100. ఈ కార్ లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.

అయితే.. కారు ప్రమాదానికి సంబంధించిన వార్తల్లో నిజం లేదని.. హీరో తరుణ్, అతని తల్లి రోజా రమణి స్పష్టం చేశారు. యాక్సిడెంట్ అయిన కారుకు, తనకు ఎలాంటి సంబంధంలేదని, రాత్రి నుంచి తాను ఇంటి వద్దే ఉన్నానని, తన కారుకు కూడా ఎలాంటి ప్రమాదం కాలేదని తరుణ్ తెలిపాడు.