ఇప్పుడు అందరి దృష్టి ‘RRR’ పైనే

0
55

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ’బాహుబలి’తో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘RRR’ పైనే ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తోన్నఈ మల్టీస్టారర్‌ను డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘RRR’ టీమ్ బల్గేరియా వెళ్లనున్నట్లు సమాచారం. తాజాగా ఇప్పుడు తెరకెక్కిస్తోన్న ‘RRR’ లోనూ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ మాత్రమే పాల్గొంటారు. ఈ చిత్రంలో తారక్ తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే మన్యం వీరుడి పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. రెండు నిజమైన పాత్రల మధ్య సాగే కల్పిత కథతో సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.