మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును సాదించిన రహానే

0
38

కరీబియన్‌ పర్యటనలో టీమిండియా టెస్టు సిరీస్‌ను ఘన విజయంతో ప్రారంభించింది. బౌలింగ్‌లో ఎలాంటి ప్రతిఘటనా, బ్యాటింగ్‌లో ఒక్క మంచి ప్రదర్శనా కనబర్చలేని వెస్టిండీస్‌… సొంతగడ్డపై భారత్‌ చేతిలో దారుణ పరాజయం మూటగట్టుకుంది. రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన తొలి టెస్టులో భారత్‌ 318 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. పరుగుల పరంగా విండీస్‌ జట్టుపై భారత్‌దే అత్యుత్తమ విజయం. సుదీర్ఘ విరామం తర్వాత సెంచరీ చేయడం వెలకట్టలేనిది. ఇది నా కష్టకాలంలో వెన్నంటే ఉన్న అభిమానులకు అంకితం ఇస్తున్నాను’అని రహానే పేర్కొన్నాడు.  తొలి ఇన్నింగ్స్‌లో 81 పరుగులు చేసిన రహానే.. రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులు చేశాడు.విండీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో వంద పరుగులకే ఆలౌట్‌ కావడంతో టీమిండియా భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. రహానే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును గెలుచుకున్నాడు.