సింధు, సాయిప్రణీత్‌లకు 20 లక్షల రివార్డు

0
44

ప్రపంచ చాంపియన్‌షిప్  పతకాలు కొల్లగొట్టిన పీవీ సింధు, సాయిప్రణీత్‌లకు భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బాయ్‌) నజరానా ప్రకటించింది. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన సింధుకు ఏకంగా రూ. 20 లక్షల రివార్డును అందజేయనున్నట్టు వెల్లడించింది. కాంస్యంతో 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన సాయి ప్రణీత్‌కు రూ. 5 లక్షలు అందజేయనున్నట్టు బాయ్‌ ట్వీట్‌ చేసింది. కర్ణాటక ముఖ్య మంత్రి యడియూరప్ప సింధుకు రూ. 5 లక్షల రివార్డు ప్రకటించారు.