సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తన తల్లి శిరోమణి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. అమెరికాలో జరిగిన ఓ మ్యూజికల్ కన్సర్ట్‌లో ఆమె పుట్టిన రోజు సందర్భంగా పాడిన పాట వీడియోను తన ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేశారు దేవీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మా నాన్న 30 ఏళ్ల వయసులో తీవ్రమైన గుండెపోటు వచ్చింది. కానీ అప్పటి నుంచి మా అమ్మ ఆయన్ను అంటిపెట్టుకొని ఉంటూ ఆయన్ను కాపాడుతూ వచ్చారు. ఆమె ఓ మెడిసిన్‌లా నాన్నను రక్షించారు.
ఈ రోజు మేం ఇలా ఉన్నాం అంటే అందుకు కారణం అమ్మే’ అన్నాడు దేవీ శ్రీ ప్రసాద్. దేవీ తమ్ముడు సాగర్‌తో పాటు ఆయన మ్యూజిక్ ట్రూప్‌లోని గాయకులు, వాద్య కళాకారులు కూడా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.