డీజీపీ కంచన్ చౌదరి కన్నుమూత

0
35

భారత తొలి మహిళా డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య(72) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

1973 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి అయిన కాంచన్ చౌదరి.. 2004లో ఉత్తరాఖండ్ డీజీపీగా పని చేశారు. తొలి మహిళా ఐపీఎస్‌గా అరుదైన ఘనతను సాధించారు. 2007 అక్టోబరు 31న పదవీ విరమణ చేసిన ఆమె.. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 33ఏళ్ల తన సర్వీసులో ఎన్నో ఘనతలు ఆమె సొంతం చేసుకున్నారు. రాష్ట్రపతి మెడల్, రాజీవ్ గాంధీ అవార్డులను ఆమె అందుకున్నారు. సుప్రసిద్ధ రిలయన్స్ – బాంబే డైయింగ్, జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సయ్యద్ మోదీ హత్య కేసులను ఛేదించడంలో ఆమెకు మంచి పేరు వచ్చింది.