సినీ ప్రయాణంలోని చేదు అనుభవాలను పంచుకున్న నటి

0
46

సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పేరిట నటీమణులను నమ్మించి వంచిస్తున్నారంటూ పలువురు నటీమణులు ఆరోపిస్తుండటంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సినీ ప్రయాణం ఆరంభంలో తాను కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు ప్రముఖ బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ తెలిపారు. ఇటీవల ఆమె నటించిన మిషన్‌ మంగళ్‌ సినిమా విజయవంతమైన సందర్భంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. సినీ కెరీర్‌ ప్రారంభంలో దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తనను రూమ్‌కి రమ్మన్నాడని ఆమె తెలిపారు. అంతేకాకుండా మరొక నిర్మాత తనను చూసి నీది హీరోయిన్‌ ముఖమేనా అని అన్నారని ఆనాటి చేదు అనుభవాలను గుర్తుతెచ్చుకున్నారు.