స్టాప్‌ లైన్‌ లేకున్నా రూ. 2వేలు చెల్లించాల్సిందే

0
41

గంటకు 35వేల వాహనాలు రాకపోకలు కొనసాగించే పంజాగుట్ట కూడలి. రెడ్‌సిగ్నల్‌ పడటంతో వాహనచోదకులు ఆగారు. మోటార్‌ వాహన చట్టం నిబంధనల ప్రకారం మూడు ఆటోలు.. ఒక జీప్‌, ఒక ద్విచక్ర వాహన చోదకుడు రహదారి నిబంధనలు ఉల్లంఘించారు. కూడలి వద్ద ఉన్న ‘స్టాప్‌లైన్‌’ దాటేశారు. అక్కడే ఉన్న కెమెరా వీరి ఫొటోలను తీసి వాహనాల నంబర్ల ఆధారంగా ఆయా వాహన యజమానులకు ‘ఈ-చలాన్‌’ పంపేస్తుంది. కొత్త చట్టం ప్రకారం వీరిలో ఒక్కొక్కరూ రూ.2వేలు జరిమానా కట్టాల్సిందే… స్టాప్‌లైన్‌ అన్న సూచనకు అక్కడ తెల్లగీతలు లేవు… స్టాప్‌ అన్న   అక్షరాలు ఉంటే మేం దాటేసి పోం అని వాహనచోదకులు వాదిస్తే… స్టాప్‌లైన్‌… స్టాప్‌ అక్షరాలు… జీబ్రా గీతలు గీయాల్సింది మా బాధ్యత కాదు.. జీహెచ్‌ఎంసీ అని ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు చెబుతున్నారు.’’