కావలసిన పదార్ధాలు:
క్యాలీఫ్లవర్ పువ్వులు – కప్పు, ఉప్పు- తగినంత, కారం- నాలుగు చెంచాలు, ఆవపిండి- చెంచా, చింత పండు రసం- తగినంత, నూనె- అరగ్లాసు, మెంతి పిండి – చెంచా, ఇంగువ, పసుపు – చిటికెడు, కరివేపాకు- రెండు రెమ్మలు చొప్పున తీసుకోవాలి.
తయారీ విధానం:
ముందుగా ఒక పాత్రలో క్యాలీఫ్లవర్ పువ్వులు తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తరవాత గోరువెచ్చ నిటితో కడిగి తడి పూర్తిగా ఆరిన తరువాత క్యాలీఫ్లవర్ పువ్వులు వేయాలి. మొత్తం మిశ్రమాన్ని పూర్తిగా కలపాలి తరువాత తాలింపు వేయాలి అంతే దీన్ని రెండు రోజులతరువాత తింటే చాలాబగుంటుంది.