సుందర్.సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘యాక్షన్’. మాస్, కమర్షియల్, యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కిస్తున్నారు. తమన్నా కథానాయిక. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ విశాల్ నా ఇంట్లో ఓ వ్యక్తిలా ఉంటారు. ఆయనతో సినిమాను తెరకెక్కించడం చాలా సులభమైన విషయం. ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలకు డూప్ లేకుండా ఆయనే నటించారు.
సైనిక అధికారిగా కనిపించి అందర్నీ ఆకర్షిస్తారు. తమన్నా కూడా ఆదే విభాగ అధికారిణిగా నటించారు. ‘బాహుబలి’ సిటీ వెర్షన్ తమన్నాగా ఇందులో ఆమె ఉంటారు. ఆమె యాక్షన్ లెవల్స్ చూసి నేనే ఆశ్చర్యపోయా. ఐశ్వర్యాలక్ష్మి హోమ్లీ పాత్రలో నటించారు. ప్రతిభ ఉన్న నటి. నేను అన్ని జోనర్లలో సినిమాలను తెరకెక్కించా.