కేన్సర్‌ వ్యాధి చికిత్స నత్త లోని జిగురు

0
133

సముద్రపు నత్తల గ్రంధులు స్రవించే జిగురు కేన్సర్‌ వ్యాధి చికిత్సకు సమర్థమైన మందుగా ఉపయోగపడుతుందని ఆ్రస్టేలియాలోని ఫ్లిండర్స్, సదరన్‌ క్రాస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే నత్తల నుంచి నొప్పిని తగ్గించే మందులతోపాటు మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడే ఇన్సులిన్‌ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సముద్ర జీవుల్లో మనకు ఉపయోగపడే రసాయనాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు కేథరీన్‌ అబోట్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది.

బ్యాక్టీరియా నుంచి రక్షించుకునేందుకు గాను ఆస్ట్రేలియా ప్రాంతంలోని ఒక రకమైన నత్త తన గుడ్లలోకి ప్రత్యేకమైన పదార్థాన్ని విసర్జిస్తున్నట్లు వీరు గుర్తించారు. ఈ పదార్థాన్ని కేన్సర్‌ కణాలపై ప్రయోగించినప్పుడు అవన్నీ మరణించాయని తెలిపారు. నత్తల జిగురులోని 6-బీఆర్‌ అనే పదార్థం పేగు కేన్సర్‌ కణితుల సైజును తగ్గించగలదని ప్రయోగాల ద్వారా వెల్లడైంది. సహజ సిద్ధమైన పదార్థం స్థానంలో తాము కృత్రిమంగా తయారు చేసిన 6-బీఆర్‌ను జంతువులపై ప్రయోగించి సత్ఫలితాలు సాధించామని కేథరీన్‌ తెలిపారు.