భారీగా పెరిగిన బంగారం ధరలు

0
34

పసిడి ధరల పెరుగుదలకు అడ్డేలేకుండా పోయింది. దేశీయంగా మేలిమి బంగారం 10 గ్రాముల ధర గురువారం రూ.40,000 దాటింది. వెండి కూడా కిలో రూ.49,000కు చేరింది. బంగారం ధర దేశీయంగా ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.40,300, వెండి కిలో రూ.49,000 ఉంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమన ఆందోళనలు, అమెరికా-చైనాల మధ్య వాణిజ్యయుద్ధం జరుగుతున్న నేపథ్యంలో, సురక్షితమని భావించి మదుపర్లు తమ పెట్టుబడులను పసిడిపైకి మళ్లిస్తున్నందునే, ధర ఇంతలా పెరుగుతోంది.