మార్కెట్లోకి రానున్న మరో కొత్త ఐఫోన్

0
42

ఐఫోన్ ప్రియులకు శుభవార్త. మరికొద్ది రోజుల్లో కొత్త మోడల్‌ ఐఫోన్లు రాబోతున్నాయి. సెప్టెంబరు 10న జరిగే  కార్యక్రమంలో సరికొత్త ఐఫోన్లను ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఏటా సెప్టెంబరు 10న కాలిఫోర్నియాలోని కూపర్టినోలో గల యాపిల్‌ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం జరుగుతుంది.

ప్రతి సంవత్సరం అదే రోజున కొత్త మోడళ్లను విడుదల చేస్తూ రావడం యాపిల్‌ ఆనవాయితీగా మారింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కొత్త ఐఫోన్‌ను ఆవిష్కరించేందుకు యాపిల్‌ సన్నాహాలు చేస్తోంది. ఫోన్లతో పాటు సరికొత్త యాపిల్‌ వాచ్‌ మోడల్‌ను కూడా ఆవిష్కరించే అవకాశాలున్నాయి. భారత మార్కెట్లో యాపిల్‌ ఉత్పత్తులకు గిరాకీ ఎక్కువే. అయితే ఈ మోడళ్లు భారత మార్కెట్లోకి ఎప్పుడొస్తాయనేది సెప్టెంబరు 10నే వెల్లడించనున్నారు.