వరద బాధితులకు అండగా ప్రధాని నరేంద్ర మోదీ

0
53

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 7న బెంగళూరులో పర్యటిస్తున్నారని ఈ సందర్భంగా రాష్ట్రంలో వరద పరిస్థితిని ఆయనకు వివరించి భారీగా పరిహారం కోరుతామని సీఎం యడియూరప్ప తెలిపారు. గురువారం మైసూరులో చాముండేశ్వరి దేవిని దర్శించుకొని కెఆర్‌ఎస్‌ ప్రాజెక్ట్‌ వద్ద కావేరీ నదీమాతకు వాయనం సమర్పించారు.

వరద బాధితుల కోసం 10 వేల రూపాయల చొప్పున పరిహారంగా అందిస్తున్నామని ఇళ్ళ నిర్మాణానికి 5 లక్షలు, మరమ్మతులకు లక్ష రూపాయలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో వరద బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. కావేరీ నదికి అనుబంధమైన నాలుగు ప్రాజెక్ట్‌లు నిండటం సంతోషంగా ఉందన్నారు. కావేరీ మాతకు వాయనం సమర్పించి రైతులకు మంచి జరగాలని ప్రార్థించినట్లు వివరించారు. ఆయన వెంట మంత్రులు సోమణ్ణతో పాటు పలువురు ఉన్నారు.