బొక్కేలు వద్దు.. పుస్తకాలు ఇవ్వాలన్న సబితా ఇంద్రారెడ్డి

0
46

తెలంగాణ నూతన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సబితా ఇంద్రారెడ్డి తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే వారిని పూల బొకేలతో కాకుండా, వాటికి బదులుగా నోట్‌పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని కోరిన విషయం తెలిసిందే. ఆ పిలుపుకు స్పందించిన అభిమానులు, కార్యకర్తలు 30వేలకు పైగా పుస్తకాలు, పెన్నులు, బాక్స్‌లు అందించారు. వీటిని త్వరలోనే పాఠశాలలకు వెళ్లి పేద విద్యార్థులకు అందజేయనున్నారు. బొక్కేలు వద్దు.. పుస్తకాలు ఇవ్వాలన్న పిలుపునకు స్పందించిన వారందరికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.