‘RDX లవ్’ ట్రైల‌ర్: పవర్ ఫుల్ పాత్రలో పాయల్

0
27

పాయల్ రాజ్‌పుత్, తేజ‌స్ కంర్ల హీరో హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్రం ‘RDX లవ్’. హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శంక‌ర్‌భాను ద‌ర్శ‌కుడు. సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌లో రొమాన్స్ చూసి.. ప్ర‌స్తుతం సినిమాల్లో పెరుగుతున్న రొమా్న్స్‌కి టీజ‌ర్ పీక్స్‌గా ఉంద‌ని అనుకున్నారు. ట్రైల‌ర్ ఎలా ఉంటుందోన‌ని భావించారు. అయితే మంగ‌ళ‌వారం విడుద‌లైన ట్రైల‌ర్ సినిమా అస‌లు కంటెంట్ ఏంటో చూపించింది.

`అన‌గ‌న‌గా ఓ క‌థ చెబుతాను. ఓ ఊరి క‌థ‌` అంటూ గోదావ‌రి న‌దికి ద‌గ్గ‌ర‌గా ఉండే ఊరుని చూపించ‌డంతో ట్రైల‌ర్ స్టార్ట్ అయ్యింది.`నిజంగా మా ఊరి స‌మ‌స్య తీరుతుందంటే మా ఊరంతా ఆత్మాహుతికి సిద్ధ‌ప‌డ‌తామ‌ని న‌రేశ్ చెప్పిన ఇన్‌టెన్స్ డైలాగ్ సినిమా క‌థ ఓ ఊరి చుట్టూ తిరుగుతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. వేటాడాలనుకున్న మ‌గాడికి ఆడ‌పిల్ల లేడిపిల్ల‌లా క‌న‌పించొచ్చుకానీ ఆడ‌పిల్ల వేటాడాల‌నుకుంటే మ‌గ సింహం కూడా కుక్క‌పిల్ల‌లా క‌న‌ప‌డుతుంది` అని పాయ‌ల్ చెప్పే ప‌వ‌ర్‌ఫుట్ డైలాగ్ ఆమె క్యారెక్ట‌ర్‌లోని డెప్త్‌ను తెలియ‌జేస్తుంది. ఈమె పాత్ర పేరు అలివేలు అని అర్థ‌మ‌వుతుంది.

అమ్మాయిల‌తో మాట్లాడాలంటే నిజం చెప్పి బ్ర‌తిమాలండి, క‌రిగిపోతారు. అబ‌ద్దం చెప్పి బాధ పెట్ట‌కండి, క‌రిగించేస్తారు. ` అని పాయ‌ల్ చెప్పే డైలాగ్ చూస్తుంటే హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్‌లోనిద‌ని అర్థ‌మ‌వుతుంది.