దేశమంతా హిందీ నేర్చుకోవాల్సిందే.

0
40

దేశమంతా ఒకే భాష ఉండాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రకటనలు దేశ ఐక్యతను దెబ్బతీస్తాయన్నారు. అమిత్ షా తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నాయకులతో సమావేశమై .. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్టాలిన్ అన్నారు. హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘ఆత్మావలోకనం చేసుకోవలసిన సందర్భమిది. చాలా దేశాల్లో వారి మాతృభాషలు కనుమరుగయ్యాయి. మాతృభాషను విస్మరిస్తే.. ఆ దేశ ఉనికే ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది. భాషను వదిలేస్తే సంస్కృతిని పరిరక్షించుకోలేము. భిన్న భాషలు, మాండలికాలే ఈ దేశ బలం. కానీ ఈ దేశానికి ఓ భాష అంటూ ఉండాలి. అలా అయితే ఈ దేశంలో పరాయి భాషలకు చోటుండదు. అందుకే మన స్వాతంత్ర్య సమరయోధులు హిందీని రాజభాషగా ముందుకు తీసుకు వచ్చారు’’ అని వ్యాఖ్యానించారు.