గోదావరిలో నిషాదం.

0
37

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో గోదావరిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో బోటు (లాంచీ) 315 అడుగుల లోతులో మునిగిపోయినట్టుగా ఎన్డీఆర్‌ఎఫ్ గుర్తించింది. లోతు ఎక్కువగా ఉండటం, ప్రవాహం ఉధృతంగా ఉండటంతో లాంచీని వెలికితీసేందుకు ఎక్కువ సమయం పడుతోందని ఎన్డీఆర్‌ఎఫ్ వెల్లడించింది. గల్లంతైన వారిలో చాలా మంది లాంచీలో చిక్కుకుపోయి ఉండే అవకాశముందని ఎన్డీఆర్‌ఎఫ్ భావిస్తోంది. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌తో ఓఎన్‌జీసీ చాప్టర్‌ ప్రత్యేక బృందాలు, నేవీ బృందాలతో పాటు గజ ఈతగాళ్లు గాలింపు జరుపుతున్నారు.

గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అయితే ప్రమాదానికి 5 నిమిషాల ముందు పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా తీసుకున్న వీడియో ఒకటి ఇప్పడు బయటకు వచ్చింది. ప్రమాదాన్ని ఊహించని వారంతా సరదాగా  డాన్స్‌ చేస్తూ, సెల్ఫీలు దిగుతూ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు. అంతలోనే బోటు ఒక్కసారిగా కుదుపునకు గురై మునిగిపోయింది. క్షణాల్లో ఊహించని పరిణామం ఎదురై వారి ఆనంద క్షణాలను నీటిలో కలిపేశాయి.