కోడెల మృతిని రాజకీయం చేయరాదు. పల్నాటి పులిగా పేరొందిన వ్యక్తి ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. వారం రోజుల కిందట బీజేపీలో నా కంటే సీనియర్ నాయకుడితో ఆయన టచ్‌లో ఉన్నారు. టీడీపీ అధినాయకత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరును కోడెల జీర్ణించుకోలేకపోయారు. సన్ స్ట్రోక్ కూడా ఇబ్బంది పెట్టింది. రూపాయి ఆశించకుండా వైద్యం చేసిన వ్యక్తి.. తన పిల్లల మీద, తన మీద ఆరోపణలు రావడంతో బాధపడ్డారు. ఈ కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు అండగా నిలబడలేదు. కష్టసమయంలో పార్టీ తనను ప్రొటెక్ట్ చేయలేదన్న ఆవేదన ఆయన మాటల్లో కనిపించింది. ఆయన పార్థీవదేహం ఉండగానే ఆయన మృతి పట్ల రాజకీయాలు చేయడం మంచి విషయం కాదు.
కోడెల పార్థీవదేహం ఉండగానే రాజకీయంగా రచ్చ చేయడం సరికాదు. ఇరురాష్ట్ర ప్రభుత్వాలు కోడెల మృతిపై సమగ్రమైన విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి. కోడెల పర్సనల్ సెల్‌ఫోన్ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పార్టీ తీరుతో ఒంటరి భావనకు లోనైన కోడెల ఒక నెల కిందట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని, ఆస్పత్రిలో కూడా జాయిన్ అయ్యారని గతంలో కథనాలు వచ్చాయి. కోడెల మృతి విషయంలో అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరముంది.